ఓజీ మేనియా.. థియేటర్లలో సందడి చేసిన స్టార్స్

OG Mania Heroes Nani, Sai Durgha Tej, Varun Tej and Akiranandan Watched Film With Fans

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ నేడు భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్లలో సత్తా చాటుతోంది. దీంతో ఆయా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలంతో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, పవన్ కళ్యాణ్ గారి కుమారుడు అకిరానందన్, కూతురు ఆద్యా కలిసి అభిమానులతో కలిసి థియేటర్లో సందడి చేశారు. పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ వస్తూనే సాయి ధరమ్ తేజ్ కేకలు వేస్తూ, విశిల్ కొడుతూ థియేటర్ మొత్తాన్ని ఉత్సాహంతో నింపేశారు.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా అభిమానులతో పాటు థియేటర్లో ‘ఓజీ’ చూసి పవర్ స్టార్‌కు తన సపోర్ట్ తెలిపారు. అంతేకాదు, నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా సినిమా చూసేందుకు వచ్చి థియేటర్‌లో కనిపించడం అభిమానులను మరింత ఎగ్జైటింగ్‌గా మార్చింది. ఇక ఇంతమంది హీరోలు ఓజీని వీక్షించేందుకు థియేటర్లకు తరలిరావడం ప్రేక్షకులకు థ్రిల్ పంచింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.