నటీనటులు : పవన్ కళ్యాణ్ , ప్రియాంక మోహన్ ,శ్రీయా రెడ్డి , అర్జున్ దాస్
ఎడిటింగ్ : నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ : రవి కె చంద్రన్ , మనోజ్ పరమహంస
సంగీతం : తమన్
దర్శకత్వం: సుజీత్
నిర్మాతలు : దానయ్య డివివి ,కళ్యాణ్ దాసరి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీ భారీ అంచనాల మధ్య థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.పవన్ వీరాభిమాని సుజీత్ ఈసినిమాను డైరెక్ట్ చేయడం దానికి తోడు తమన్ ఇచ్చిన సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ కావడం అలాగే ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో నెక్స్ట్ లెవెల్ హైప్ వచ్చింది. మరి ఈసినిమా ఆ అంచనాలను ఎంతవరకు నిలబెట్టిందో రివ్యూలో చూద్దాం.
కథ :
1990లో ముంబై నేపథ్యంగా సాగే కథ ఇది.ముంబైలో సత్యా దాదా (ప్రకాశ్ రాజ్) కంట్రోల్‌లో ఉండే షిప్ యార్డ్‌కు ఒక భారీ షిప్ చేరుతుంది.ఆ షిప్‌లోని ఒక కంటైనర్‌లో ప్రమాదకరమైన ఆర్‌డీఎక్స్ ఉంటుంది.ఆ కంటైనర్ వెనుక ఉన్నది ఓమి (ఇమ్రాన్ హష్మీ) అనే శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్.ఆ కంటైనర్ తీవ్రవాదుల చేతికి చేరితే నగరం నాశనమవుతుందనే సత్యా దాదాకు బాగా తెలుసు.అందుకే అతడు దానిని దాచేస్తాడు. కానీ ఆ కంటైనర్ కోసం ఓమి స్వయంగా ముంబైలో అడుగుపెడతాడు.సత్యా దాదా మనుషుల్ని ఒక్కొక్కరి చంపేసుకుంటూ వెళ్తాడు.ఇలాంటి పరిస్థితుల్లో సత్యా దాదా, అతని వర్గాన్ని రక్షించగల ఒక్కరే ఉన్నాడని అందరూ అనుకుంటారు.అతడే ఓజస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్).అయితే ఓజీకి ముంబైతో, సత్యా దాదాతో ఉన్న గత సంబంధం ఏమిటి? పదిహేనేళ్ల క్రితం ముంబై వదిలి వెళ్లిపోయిన అతను మళ్లీ ఎందుకు వస్తాడు? ఓమిని ఎదిరించి అతడు ఏం చేశాడు? అనేది మిగితా కథ.
విశ్లేషణ :
మాఫియా నేపథ్యంలో సాగే కథ ఓజీ. ఇందులో పవన్ కళ్యాణ్ ను నెవెర్ బిఫోర్ రోల్ లో చూపించాడు సుజీత్. పవన్ ఎలివేషన్ సీన్స్ బాగా వచ్చాయి. ఫ్యాన్స్ విజిల్ వేయించేలా తీశాడు.సినిమా స్టార్టైన అరగంట వరకు హీరో కనిపించడు.. కానీ ఆ సమయంలో కూడా పవన్ ఎప్పుడొస్తాడు అనే సస్పెన్స్ ను క్రియేట్ చేసి ఉత్కంఠను పెంచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.ఇక పవన్ ఎంట్రీ సీన్ కి థమన్ ఇచ్చిన ఆర్.ఆర్, ఆ మూడ్ అన్నీ కలిపి ఫ్యాన్స్‌కు అసలు పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.ఫస్ట్ హాఫ్‌లో పవన్ స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నా ఆయన ఇంపాక్ట్ మాత్రం ఎక్కువే. ముఖ్యంగా ఇంటర్వల్ ముందు వచ్చే సీన్స్ లతో ఫస్ట్ హాఫ్ సూపర్ అనిపిస్తుంది.
ఇక ఇంటర్వెల్ తరువాత 20 నిమిషాలు చాలా స్పీడ్‌గా సాగుతుంది.అందులో భాగంగా పోలీస్ స్టేషన్ సీన్ లో పవన్ కళ్యాణ్ ఎనర్జీ పీక్స్‌లో ఉంటుంది.ఆ సీన్ ఒక్కటే అభిమానులను మళ్లీ మళ్లీ సినిమా చూసేలా చేస్తుంది.ఇక క్లైమాక్స్‌లో పవన్ బుల్లెట్ల వర్షం కురిపిస్తూ దూసుకెళ్లే సీన్లు వర్కౌట్ అయ్యాయి.తమన్ ఇక్కడ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. చివర్లో ఓజీ 2కి హింట్ ఇచ్చారు.ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన ఫీలింగ్ కలిగినా సినిమా మాత్రం బాగుందన్న ఫీల్ తో ముగుస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత స్టైలిష్ లుక్‌తో, అద్భుతమైన ఎనర్జీతో మెప్పించాడు.తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇక విలన్ పాత్రలో నటించిన ఇమ్రాన్ హష్మీ స్టైలిష్‌గా కనిపించాడు.కొన్ని సీన్లలో హీరోకు సమానంగా పోటీ ఇచ్చాడు.కానీ ఆపాత్రను మరింత బలంగా రాసి ఉంటే ఇంకా ప్రభావం చూపించేవాడు.ప్రియాంక మోహన్ రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో కనిపించిన పవన్ తో కెమిస్ట్రీ బాగా కుదిరింది.ప్రకాశ్ రాజ్ తన అనుభవంతో పాత్రను సమర్ధవంతగా పోషించాడు.అర్జున్ దాస్ తన వాయిస్‌తో సీన్‌లను ఎలివేట్ చేశాడు.శ్రియా రెడ్డి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో ఆకట్టుకుంది.
టెక్నికల్ కూడా సినిమా అదరగొట్టింది.తమన్ సంగీతం సినిమాలో మెయిన్ హైలైట్.బిజిఎమ్,సాంగ్స్ అన్ని వేరే లెవెల్‌లో ఉన్నాయి. టైటిల్ సాంగ్ ఎన్నిసార్లు విన్నా బోర్ కొట్టదు.సుజీత్ ఫ్యాన్ బాయ్ డ్యూటీ చేశాడు. ప్రతి ఫ్రేమ్‌లో పవన్ ఇమేజ్‌కి తగిన ఎలివేషన్ ఇచ్చాడు.ఎమోషన్‌పై కాస్త ఎక్కువ దృష్టి పెట్టి ఉంటే సినిమా మరింత బలంగా ఉండేది.సినిమాటోగ్రఫీ హాలీవుడ్ రేంజ్‌లో వుంది. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది.డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి.
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య వచ్చిన ఓజీ పవన్ కళ్యాణ్ అభిమానులు పండుగ చేసుకునేలా వుంది.తమ హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో ఈసినిమాలో అలా చూపించాడు సుజీత్. కొన్ని సీన్లు, ఎలివేషన్లు అభిమానులు పదే పదే చర్చించుకునేలా ఉన్నాయి. పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు మిగితా వారికి కూడా ఈసినిమా నచ్చుతుందనడం ఎలాంటి సందేహం లేదు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























