ఆంధ్రాలో కూడా రేపే పడనున్న ఓజీ షోలు

OG Premieres Kickstart Tomorrow Across Andhra pradesh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ మూవీ ఓజీ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ,ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి.ఇక విడుదలకు ఒక రోజు ముందు గానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓజీ షోలు పడనున్నాయి.ఇంతకుముందు రిలీజ్ డేట్ 25న అర్ధరాత్రి 1గంటకు ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతించగా నిన్న ఈజీవో ను మార్చి కొత్త జీవో ను రిలీజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొత్తగా రిలీజ్ చేసిన జీవో లో బుధవారం రాత్రి 10 గంటలకే ప్రీమియర్స్ పడనున్నాయని తెలిపింది.కానీ టికెట్ రేట్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.జీఎస్టీ తో కలుపుకొని ప్రీమియర్స్ టికెట్ల ధర 1000 రుపాయలు.ఇక తెలంగాణ లో రేపు రాత్రి 9 గంటలకే ప్రీమియర్ షోలు పడనున్నాయి.వీటి ధర 800గా నిర్ణయిస్తూ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.దాంతో మొదటి రోజు ఓజీ రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టుకోనుంది.తెలుగు రాష్ట్రాల్లో మొదటి 10 రోజులు టికెట్ హైక్ కూడా ఉండడంతో హిట్ టాక్ వస్తే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఓజీ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించనుంది.

సుజీత్ తెరకెక్కించిన ఈసినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక ఆరుళ్ మోహన్ నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ప్రకాష్ రాజ్,అర్జున్ దాస్ ,శ్రీయా రెడ్డి కీలక పాత్రలు పోషించారు.థమన్ సంగీతం అందించగా డివివి దానయ్య ,కళ్యాణ్ దాసరి ఈసినిమాను నిర్మించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.