మోహన్‌లాల్‌కి ‘దాదా సాహెబ్ ఫాల్కే’ తగిన గుర్తింపు – మెగాస్టార్

Megastar Chiranjeevi Congrats Mohanlal on Dadasaheb Phalke Award

మలయాళ అగ్రకథానాయకుడు మోహన్‌లాల్‌ను కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసింది. మలయాళంలోనే కాకుండా ప్రధాన భారతీయ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించిన మోహన్‌లాల్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మోహన్‌లాల్‌ను అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిజేశారు. ఈ మేరకు ఎక్స్‌లో.. “డియర్ లాలెట్టన్, ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడినందుకు హృదయపూర్వక అభినందనలు. మీ అద్భుతమైన ప్రయాణం, ఐకానిక్ పెర్ఫార్మెన్స్, భారతీయ సినిమాను సుసంపన్నం చేశాయి. నిజంగా ఇది మీకు తగిన గుర్తింపు'” అని పేర్కొన్నారు.

ఇక ఈ సందర్భంగా మోహన్‌లాల్‌తో ఉన్న ఫోటోని షేర్ చేశారు మెగాస్టార్. మోహన్‌లాల్‌తో మెగాస్టార్ చిరంజీవికి మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ నెల 23న జరిగే 71వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో భారత ప్రభుత్వం మోహన్‌లాల్‌ను ఈ అవార్డుతో సత్కరించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.