ఇడ్లీ కొట్టు ట్రైలర్ రిలీజ్.. నెక్స్ట్ లెవెల్లో ధనుష్ యాక్షన్, డైరెక్షన్

Idli Kottu Trailer Out, Dhanush Steals The Show With His Acting and Directorial Vision

కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరో ధనుష్ స్వీయదర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. తమిళంలో ‘ఇడ్లీ కడై’ పేరుతో రూపొందిన ఈ సినిమాను శ్రీ వేదాక్షర మూవీస్ తెలుగు ప్రేక్షకుల చెంతకు తీసుకొస్తోంది. అక్టోబర్ 1న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. దీనిలో భాగంగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ట్రైలర్ చూస్తుంటే, సినిమా ఒక బలమైన ఎమోషనల్ కథాంశంతో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ధనుష్ నటన, అలాగే దర్శకుడిగా ఆయన చూపించిన ప్రతిభ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే అరుణ్ విజయ్, సత్యరాజ్, షాలినీ పాండే కీలక పాత్రల్లో కనిపించారు.

కాంతారాతో గట్టి పోటీ..

‘ఇడ్లీ కొట్టు’ తెలుగు హక్కులను శ్రీ వేదాక్షర మూవీస్ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ధనుష్ కెరీర్‌లో తెలుగులో అత్యధిక థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 2న రిషబ్ శెట్టి తన పాన్ ఇండియా ఫిల్మ్ ‘కాంతారా: చాప్టర్ 1’తో వస్తున్న క్రమంలో, ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ ఎదురవనుంది.

అయినాసరే, కథపై ఉన్న నమ్మకంతో ధనుష్ ఈ సినిమాను అక్టోబర్ 1నే విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ అందుకున్న ప్రమోషనల్ కంటెంట్‌కి ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సినిమాపై హైప్ మరింత పెంచేసింది. మరోవైపు, ఈ సినిమా ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.