ఓజీ నుండి శ్రియా రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Team OG Released Sriya Reddy's First Look Poster

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’. ‘They Call Him OG’ నేడు ట్యాగ్ లైన్. మరో ఐదు రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా, ప్రముఖ నటి, ‘సలార్’ ఫేమ్ శ్రియారెడ్డి నటిస్తున్న కీలక పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో ఆమె గీత అనే పాత్రలో కనిపించనున్నట్టు అధికారికంగా వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రియారెడ్డి క్యారెక్టర్‌ రివీల్..

ఈ పోస్టర్‌లో శ్రియారెడ్డి పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. చేతుల్లో గన్ పట్టుకుని, ఎవరినో ఎయిమ్ చేస్తున్నట్టుగా ఉంది. ఆమె కళ్లలోని తీక్షణమైన చూపు, గంభీరమైన స్టైల్ ఈ పాత్ర ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో తెలియజేస్తోంది. ఓజీ లాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాలో శ్రియారెడ్డి వంటి అనుభవజ్ఞురాలైన నటి ఉండటం సినిమాకు ఒక ప్రధాన బలం అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే పవన్ పోషిస్తున్న గ్యాంగ్‌స్టర్ పాత్ర ‘ఓజస్ గంభీర’తో శ్రియారెడ్డి పాత్ర ఎలా ముడిపడి ఉంటుందనేది ఇప్పుడు సినిమాపై ఉన్న ప్రధాన ఆసక్తిగా మారింది. ఇంతకుముందు సలార్ చిత్రంలో ఆమె తన నటనతో ఆడియెన్స్‌ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఆమె ఇదే తరహా పవర్ ఫుల్ పాత్రను పోషించినట్టు, గీత పాత్ర కథలో ఒక కీలక మలుపునకు కారణం కావచ్చని అభిమానులు ఊహిస్తున్నారు.

‘ఓజీ’ ప్రమోషన్స్‌తో హైప్ పీక్స్‌కు..

దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా, డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది. ఇప్పుడు శ్రియారెడ్డి పాత్రను రివీల్ చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.