కె ర్యాంప్ టీజర్ రిలీజ్

K Ramp Teaser Out Now

గత ఏడాది దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఈసినిమా 50కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈదీపావళికి కిరణ్ కె -ర్యాంప్ తో వస్తున్నాడు.ఫన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇందులో కిరణ్ రోల్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ అలాగే సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి.ఇక ఈసినిమా నుండి ఈరోజు టీజర్ ను కూడా రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.ఫన్ ప్యాకెడ్ గా టీజర్ ను కట్ చేశారు.ఇందులో కిరణ్ ఫుల్ హైపర్ గా కనిపించాడు.టీజర్ చూస్తుంటే ఈసారి ప్రామిసింగ్ స్టోరీ తో వస్తున్నాడని అనిపిస్తుంది. కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను తెరకెక్కిస్తుండగా యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుంది.చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.హాస్య మూవీస్ బ్యానర్ పై రాకేష్ దండా నిర్మిస్తున్నారు.అక్టోబర్ 18న సినిమా థియేటర్లోకి తీసుకురానున్నారు.అయితే అదే టైంలో మరి కొన్ని సినిమాలు కూడా బరిలోకి దిగుతుండడం తో కె ర్యాంప్ కు పోటీ ఎదురుకానుంది.

ఇక కిరణ్ ప్రస్తుతం ఈసినిమా తోపాటు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా కూడా చేస్తున్నాడు.నంబూరి రవి డైరెక్షన్ లో ప్రేమ కథా చిత్రం గా తెరకెక్కుతున్న ఈసినిమాలో మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ హీరోయిన్ నటిస్తుండగా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా కూడా ఈఏడాదే విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.