థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ ఓటీటీలోకి వచ్చేసింది.థియేటర్లలో విడుదలైన 56 రోజులతరువాత ఈసినిమా ఓటీటీ లో రిలీజయ్యింది.నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో నిన్న అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక జులై లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా ఫుల్ రన్ లో 300 కోట్ల వసూళ్లను రాబట్టి ఇండియన్ యానిమేటెడ్ మూవీస్ లో హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ ఈసినిమా బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగించింది. ఇటీవల ఇంత లాంగ్ రన్ ను కొనసాగించిన మూవీ మరొకటి లేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కన్నడ లోనే కాదు హిందీ ,తెలుగు భాషల్లో సైతం అదరగొట్టింది. హిందీలో అయితే ఏకంగా 175 కోట్ల వసూళ్లను సెన్సేషన్ సృష్టించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల జాబితాలో ఈసినిమా ప్లేస్ దక్కించుకుంది.ఇక ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది.మరి ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించగా సామ్ సీఎస్ సంగీతం అందించాడు.ప్రముఖ నిర్మాణ సంస్థ హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.తెలుగు లోఈసినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేయగా మంచి లాభాలను తీసుకొచ్చింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























