కోలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ ‘రోబో శంకర్’ కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. దీంతో, ఆయన భార్య ప్రియాంక, కుమార్తె ఇంద్రజ శంకర్ తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తొలుత కామెర్ల వ్యాధి, ఆపై..
రోబో శంకర్ కొద్ది రోజుల క్రితం ఒక సినిమా షూటింగ్‌లో అపస్మారక స్థితిలో పడిపోయారు. ఆ వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు తీవ్రమైన జీర్ణశయాంతర రక్తస్రావం మరియు మల్టీ-ఆర్గాన్ డిస్‌ఫంక్షన్‌గా నిర్ధారించారు. ఈ క్రమంలో వైద్యులు అందిస్తున్న చికిత్సకు ఆయన శరీరం స్పందించకపోవడంతో ఆరోగ్యం విషమించి గురువారం రాత్రి కన్నుమూశారు. అయితే, గతంలో శంకర్ కామెర్ల వ్యాధితో బాధపడినట్లు కూడా తెలుస్తోంది. దానినుంచి కోలుకున్నారు అనుకునేలోపే ఈ అనర్ధం జరిగింది.
అభిమానులను అలరించిన ప్రస్థానం
కాగా, రోబో శంకర్ తన కెరీర్‌ను మిమిక్రీ ఆర్టిస్ట్‌గా, స్టేజ్ ఆర్టిస్ట్‌గా ప్రారంభించారు. తన విలక్షణమైన స్టైల్, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి, ధనుష్ నటించిన ‘మారి’, అజిత్ నటించిన ‘విశ్వాసం’, విజయ్ సేతుపతి నటించిన ‘ఇదర్కుథానే ఆసైపట్టై బాలకుమారా’ వంటి అనేక హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.
సినీ ప్రముఖుల సంతాపం
రోబో శంకర్ మరణం పట్ల తమిళ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కమల్ హాసన్, ధనుష్ వంటి పలువురు ప్రముఖ నటులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు నివాళులు అర్పించారు. రోబో శంకర్ మృతదేహాన్ని ఆయన నివాసానికి తరలించారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో శుక్రవారం జరగనున్నాయి. ఆయన మరణంపై అభిమానులు, సినీ కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























