ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌ చరణ్‌

Global Star Ram Charan Named Brand Ambassador for Archery Premier League

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవం అందుకున్నారు. భారత్‌లో తొలిసారి జరుగబోతున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)కు ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ (ఏఏఐ) గురువారం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. న్యూఢిల్లీలోని యుమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా అక్టోబర్‌ 2నుంచి 12వ తేదీ వరకు అరంగేట్రం ఏపీఎల్‌ జరుగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ.. “ఆర్చరీ అనే క్రీడ..క్రమశిక్షణ, ఫోకస్‌, స్థితిస్థాపకతను కల్గి ఉంటుందన్న కారణంతో బంధం ఏర్పరుచుకోవడం జరిగింది. ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో కలిసి కొనసాగడం గర్వంగా ఉంది. భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదిక కావడమే కాదు గ్లోబల్‌ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్‌ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాను” అని పేర్కొన్నారు.

కాగా, ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీల్లో 36 మంది భారత టాప్‌ ఆర్చర్లతో సహా 12 మంది అంతర్జాతీయ ఆర్చర్లు పోటీపడనున్నారు. లైట్ల వెలుతురులో గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్‌ ఫార్మాట్‌ ద్వారా ఆర్చర్లు రికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో పోటీపడనున్నారు. ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌గా జరుగబోతున్న టోర్నీలో ఆతిథ్య భారత్‌లోని పురుష, మహిళా కాంపౌండ్‌, రికర్వ్‌ ఆర్చర్లతో పాటు వివిధ దేశాల ఆర్చర్లను ఒక చోటుకు చేర్చనుంది.

ఇక దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలింపిక్‌ మూమెంట్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో లీగ్‌ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్నొన్నారు. రామ్‌చరణ్‌ బ్రాండ్‌అంబాసీడర్‌గా దేశంలోని మరింత మంది యువత ఆర్చరీ పట్ల ఆకర్షితమయ్యేందుకు ఆస్కారం ఉంటుందని, అలాగే లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.