గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా పెద్ది.ఇప్పటివరకు సగానికి పైగా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.ఇందులో రామ్ చరణ్ డిఫ్రెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.త్వరలోనే సెకండ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు.ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ ఫస్ట్ సాంగ్ హీరో రామ్ చరణ్ , హీరోయిన్ జాన్వీ కపూర్ మధ్యలో వచ్చే లవ్ సాంగ్ గా రానుంది.అయితే ఈ సాంగ్ ను దసరా సందర్భంగా అక్టోబర్ 2 న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.త్వరలోనే సాంగ్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు ఈసినిమా నుండి గ్లింప్స్ రిలీజ్ కాగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.డిసెంబర్ లోపు షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు.ఇందులో కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తుండగా మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.
లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.మార్చి 26న పెద్ది థియేటర్లోకి రానుంది.ఈసినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























