మలయాళ మూవీ లోక చాప్టర్ 1 – చంద్ర అరుదైన రికార్డు సృష్టించింది.విడుదలైన రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తూ 250కోట్ల వసూళ్లను రాబట్టిన ఈసినిమా తాజాగా మరో రికార్డు ను ఖాతాలో వేసుకుంది.వరుసగా 20రోజులు 2కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిన మొదటి మలయాళ సినిమాగా లోక సరికొత్త రికార్డు సృష్టించింది.ఇక కేరళ లో ఈసినిమా 20రోజుల్లో 93కోట్ల వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 100కోట్ల మార్క్ ను చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.అయితే కేరళ ఆల్ టైం రికార్డు తుడరమ్ (118కోట్లు) వసూళ్లను క్రాస్ చేస్తుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 250 కోట్లపైనే వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో ఎంపురాన్ (269కోట్లు) రికార్డును బ్రేక్ చేసి లోక ఇండస్ట్రీ హిట్ గా నిలువనుంది.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా బయ్యర్లకు ఊహించని లాభాలు తీసుకొస్తుంది.
దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ వే ఫెరర్ ఈసినిమాను నిర్మించగా కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించింది.సూపర్ హీరో కాన్సెప్ట్ తో డొమినిక్ అరుణ్ తెరకెక్కించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























