గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్ ఆపేసిన నెట్ ఫ్లిక్స్

NetFlix Stops Streaming Good Bad Ugly

లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా కాపీరైట్ ఫిర్యాదు కారణంగా నెట్‌ఫ్లిక్స్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేసింది.అజిత్ నటించిన ఈ చిత్రం ఈ వేసవిలో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి,ఆ తరువాత ఆ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది.అయితే, దర్శకుడు అధిక్ రవిచంద్రన్, ఇళయరాజా పాటలను ఆయన అనుమతి లేకుండా సినిమాలో ఉపయోగించారు.దీంతో ఇయాళయరాజా న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇళయరాజా సంగీతాన్ని అనధికారికంగా ఉపయోగించినందుకు నిర్మాతలు సినిమాను ప్రదర్శించకుండా లేదా పంపిణీ చేయకుండా నిరోధిస్తూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.దీని ఫలితంగా నెట్‌ఫ్లిక్స్ తమ లైబ్రరీ నుండి ఈ చిత్రాన్ని తొలగించింది.ఇక ఇళయరాజా కాపీరైట్ విషయంలో కఠినంగా ఉంటారని పేరు పొందారు.గతంలో మంజుమ్మల్ బాయ్స్ చిత్ర నిర్మాతలపైనా ఇదే కారణంతో కేసు వేశారు.

అయితే కేవలం ఇండియాలోనే గుడ్ బ్యాడ్ అగ్లీ స్ట్రీమింగ్ ఆగిపోయింది. మిగితా దేశాల్లో మాత్రం నెట్ ఫ్లిక్స్ లో ఈసినిమా అందుబాటులో వుంది.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.ఈసినిమా 200కోట్లపైనే వసూళ్లను రాబట్టుకుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.