భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుంది.ఈరోజు మోదీ జన్మదినం సందర్భంగా ఈసినిమాను మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.మా వందే అనే టైటిల్ తో ఈ బయోపిక్ తెరకెక్కనుండగా మలయాళ హీరో ఉన్ని ముకుందన్ ఇందులో మోదీ పాత్రలో కనిపించనున్నాడు.క్రాంతి కుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.ఇక ఈసినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ,రవి బస్రుర్ సంగీతం అందించనుండగా ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్ , శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా పనిచేయనున్నారు.భారీ బడ్జెట్ తో సిల్వర్ క్యాస్ట్ క్రియేషన్స్ ఈసినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తుంది.త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.
ఇక ఈరోజు నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్బంగా టాలీవుడ్ స్టార్ హీరోలు మోదీకి విషెస్ తెలిపారు.పవన్ కళ్యాణ్ ,మహేష్ బాబు స్పెషల్ వీడియో ద్వారా విష్ చేయగా ఎన్టీఆర్ ,రామ్ చరణ్ ఎక్స్ ద్వారా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























