కిష్కింధపురిలో నేను చేసిన పాత్రకి ఇంత రెస్పాన్స్ వస్తుందనుకోలేదు – శాండీ మాస్టర్

I Never Expected Such a Response for My Role in Kishkindhapuri says Sandy Master

కిష్కింధపురిలో నేను చేసిన పాత్రకి ఇంత రెస్పాన్స్  వస్తుందనుకోలేదు – శాండీ మాస్టర్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్ లో వచ్చిన సినిమా కిష్కింధపురి.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈసినిమాను నిర్మించారు.ఇక ఈనెల 12న విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన శాండీ మాస్టర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లియో, లోక ఇప్పుడు కిష్కింధపురి వరుస విజయాలు అందుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ముందుగా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారికి థాంక్స్ చెప్పాలి. ఆయన లియోలో నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వకపోతే ఈ జర్నీ మొదలయ్యేది కాదు.చిన్నప్పుడు అందరూ నా కళ్ళను చూసి ఆటపట్టించేవారు. ‘డెత్ గోట్ ఐస్’ అంటూ టీజ్ చేసేవారు. అయితే ఇప్పుడు అదే నాకు చాలా ఆనందం ఇచ్చింది. నిజంగా నాకు అలాంటి కళ్ళు లేకపోతే లోకేష్ ఆ క్యారెక్టర్ కి నన్ను ఎంపిక చేసేవారు కాదు. విక్రమ్ సినిమాలో ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాను.అప్పుడే ఆయన లియోలో క్యారెక్టర్ గురించి చెప్పారు.లియో తర్వాత నాకు చాలా క్యారెక్టర్లు వచ్చాయి. అన్ని ఒకే తరహ సైకో పాత్రలు చెప్పేవారు. ఇలాంటి సమయంలో లోక, కిష్కింధపురి డిఫరెంట్ సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ తో వరుస విజయాలను అందుకుకోవడం చాలా ఆనందాన్నిచ్చింది.

హైదరాబాద్ కి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు?
ఓంకార్ గారు చేసిన చాలెంజ్ 3 షో తో హైదరాబాద్ కు వచ్చాను. పోతే పోనీ పోరా పాట నాకు చాలా మంచి ఫేమ్ తీసుకొచ్చింది. నాకు హ్యూమర్ సెన్స్ ఉన్న క్యారెక్టర్స్, డాన్స్ పెర్ఫార్మన్స్ అంటే చాలా ఇష్టం.

కిష్కింధపురిలో మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు మిమ్మల్ని ఆకట్టుకున్న ఎలిమెంట్స్ ఏమిటి? డైరెక్టర్ కౌశిక్ ఈ కథని అద్భుతంగా చెప్పారు. అందులో నా క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఆ క్యారెక్టర్ గురించి ఎక్కువ రివిల్ చేయకూడదు. అది ఒక సర్ప్రైజ్ లాగా ఉంచాము. ఈ క్యారెక్టర్ కోసం దాదాపు ఏడు గంటల పాటు టెస్ట్ షూట్ చేశాం. అది డైరెక్టర్ గారికి చాలా నచ్చింది. ఇలాంటి యూనిక్ క్యారెక్టర్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

కిష్కింధపురితోమీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?
ఆడియన్స్, ఫ్రెండ్స్ నుంచి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే పా రంజిత్ గారు, లోకేష్ కనకరాజు గారు సినిమా చూసి చాలా అప్రిషియేట్ చేశారు. చాలామంది ఆడియన్స్ థియేటర్స్ లో నాకు క్యారెక్టర్ వచ్చినప్పుడు గ్రేట్ రెస్పాన్స్ ఇవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.  

డైరెక్టర్ గారు ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఏమైనా రిఫరెన్స్ ఇచ్చారా? నాకు రిఫరెన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు.అయితే గతంలో సూర్య గారు చేసిన ఒక సినిమా ని రిఫరెన్స్ గా ఇచ్చారు. అయితే ఆ క్యారెక్టర్ కి ఈ క్యారెక్టర్ కి సంబంధం లేదు. చాలా కొత్తగా ఈ క్యారెక్టర్ ని ప్రజెంట్ చేయడం జరిగింది.

ప్రొడక్షన్ హౌస్ సపోర్టు ఎలా ఉంది?
– సాహు గారు చాలా స్వీట్ ప్రొడ్యూసర్.  ఒక ఫ్యామిలీలో ఒక బ్రదర్ లాగా చూసుకున్నారు.  చాలా అద్భుతంగా ట్రీట్ చేశారు. వారి ప్రొడక్షన్స్ లో వర్క్ చేయడం చాలా ఆనందించింది.

యాక్టర్ గా కొరియోగ్రాఫర్ గా ఏ జర్నీ మీకు ఎక్కువ సంతృప్తిని ఇస్తుంది?
-కొరియోగ్రఫీ నా బేస్. ఖచ్చితంగా కొరియోగ్రఫీ చేస్తాను. అయితే ప్రస్తుతం నేను యాక్టింగ్ మీద ఫోకస్ చేశాను. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ చేయాలని ఉంది. నాకు దర్శకత్వం మీద కూడా ఆసక్తి ఉంది. అయితే దానికి ఇంకా సమయం ఉంది.

మీరు ఒక సినిమాని ఎంచుకోవాలంటే దేనికి ప్రాధాన్యత ఇస్తారు?
-కథ బాగుండాలి.  మంచి కథ అయితే తప్పకుండా చేస్తాను. కథ బాగుంటే ఆటోమేటిక్గా క్యారెక్టర్ కూడా బాగుంటుంది. అన్నిటికీ పునాది మంచి కథ.

కొత్తగా చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి?
-పా రంజిత్ గారి నిర్మాణంలో హీరోగా ఒక సినిమా చేస్తున్నాను. మలయాళం లో కథామినార్ లో ఒక కీలక పాత్ర చేస్తున్నాను. ఓజీలో ప్రమోషనల్ సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.