పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్రం మరో 9 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ నెల 25న పాన్ ఇండియా వైడ్‌గా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీలో పవన్ సరసన హీరోయిన్‌గా నటించిన ప్రియాంక మోహన్, తాజాగా తెలుగు మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘ఓజీ’ సినిమా గురించి, అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పవన్‌లో నేను గమనించిన మార్పు అదే..!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్‌లో తాను గమనించిన మార్పు గురించి ప్రియాంక మోహన్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. “ఉప ముఖ్యమంత్రి కాకముందు పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్‌గా, ఎప్పుడూ లోతైన ఆలోచనల్లో ఉన్నట్లు కనిపించేవారు. కానీ, ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనలో ఒక ప్రశాంతమైన, సంతోషకరమైన మార్పును గమనించాను. ఆయన ముఖంలో తరచుగా చిరునవ్వు కనిపిస్తోంది.” అని ప్రియాంక తెలిపారు.
ఇంకా ఆమె ఇలా అన్నారు.. “అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ తన పదవికి తగిన గౌరవంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. ఇది ఆయనకు లభించిన గొప్ప విజయం. కానీ ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా కూడా, ఆయన చాలా సాదాసీదాగా, వినయంగా ఉంటారు. ప్రజలకు సేవ చేయాలనే తపన వల్ల వచ్చిందే అనిపిస్తుంది” అని ప్రియాంక మోహన్ ప్రశంసించారు. ఇక పవన్ వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
‘ఓజీ’పై అంచనాలు ఓ రేంజ్‌లో..
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఎమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన నాలుగు పాటలు సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. కాగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్నారు.
అయితే, ప్రియాంక మోహన్ చెప్పిన ఈ మాటలు పవన్ కళ్యాణ్ అభిమానులలో మరింత సంతోషాన్ని, ఉత్సాహాన్ని నింపాయి. ‘ఓజీ’ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆతృతను ఆమె వ్యాఖ్యలు డబుల్ చేశాయి. ఇక ఇప్పుడే ఇలా ఉంటే, రేపు ఓజీ విడుదలయ్యాక గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్‌ని చూసిన అభిమానులు థియేటర్లలో ఇంకెంతలా ఊగిపోతారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























