కిష్కింధపురి సినిమాకి మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Megastar Chiranjeevi Showers Praise on Kishkindhapuri

ఎట్టకేలకు యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి తో కెరీర్ లో సాలిడ్ హిట్ కొట్టాడు.గత వారం థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.వర్కింగ్ డేస్ లో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ను చూపిస్తూ దూసుకుపోతుంది.4 రోజుల్లో ఈసినిమా దాదాపు 14కోట్లపైనే వసూళ్లను సొంతం చేసుకుంది.ఆల్రెడీ నైజాంలో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఫుల్ రన్ లో ఈసినిమా 25 కోట్ల వరకు రాబట్టుకునే ఛాన్స్ లేకపోలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మెగాస్టార్ చిరంజీవి కిష్కింధపురి సినిమా చూసి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమా చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, హారర్–ఎంటర్టైన్‌మెంట్ జానర్‌లో కొత్తదనం చూపించిందని పేర్కొన్నారు.

సాధారణంగా హారర్ సినిమాలంటే భయాన్ని ఎలివేట్ చేస్తూ ఒక దెయ్యం కథ చెప్పడం జరుగుతుంది.కానీ కిష్కింధపురిలో హారర్ తో పాటు మంచి సైకలాజికల్ పాయింట్ కూడా యాడ్ చేసి చెప్పడం చాలా బాగుంది. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం చాలా ప్రమాదకరమని చెప్పడం, మనిషికున్న బాధలు కష్టాలు పక్కన వాళ్ళకి చెప్పుకోకుండా ఒంటరితనం అనుభవిస్తుంటే వచ్చే ప్రమాదాలు, పరిణామాలు చాలా సమర్థవంతంగా  చిత్రీకరించారు డైరెక్టర్ కౌశిక్.  

ఈ సినిమా ద్వారా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా మంచి విజయాన్ని దక్కించుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ తన పనితనం చాలా బాగా చూపించారు.

టోటల్ గా కిష్కింధపురి లాంటి మంచి సినిమాని అందించిన టేస్ట్ ఫుల్ నిర్మాత సాహు గారపాటి గారికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్లీజ్ గో అండ్ వాచ్ కిష్కింధపురి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.