‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన యువ దర్శకుడు బుచ్చిబాబు సానా, తాజాగా విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ చిత్ర బృందాన్ని ప్రశంసించారు. చిన్న బడ్జెట్‌తో వచ్చి పెద్ద విజయాన్ని అందుకోవడంపై ఆయన హర్షం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన సినిమా దర్శకుడు సాయి మార్తాండ్ని, హీరో మౌళి తనుజ్ని, ఇతర సాంకేతిక నిపుణులను ఆయన ప్రత్యేకంగా పొగిడారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే బుచ్చిబాబు చెప్పినట్లుగా, ‘లిటిల్ హార్ట్స్’ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. కథనం, హాస్యం, పాత్రల మధ్య ఉండే ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఈ సినిమా యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందని, అందుకే భారీ విజయం సాధించిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
యూట్యూబ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న మౌళి ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆయన తొలి సినిమానే బ్లాక్‌బస్టర్ కావడంతో సినిమా బృందం సంతోషంలో మునిగిపోయింది. ఈ చిన్న సినిమాకు బుచ్చిబాబు సానా వంటి ప్రముఖ దర్శకుడి నుంచి ప్రశంసలు రావడంతో ‘లిటిల్ హార్ట్స్’ విజయం మరింత ప్రత్యేకంగా నిలిచింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























