‘కీర్తిచక్ర’ మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడుని కలిసిన మెగాస్టార్

Megastar Chiranjeevi Meets Major Malla Ramgopal Naidu Who Won Kirti Chakra Award

తెలుగుతేజం, ధైర్యసాహసాలకు మారుపేరైన మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడును మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నారు. కాగా ఇటీవలే రాంగోపాల్ నాయుడు సైన్యంలో శౌర్యపరాక్రమాలకు సంబంధించి రెండవ అత్యున్నత పురస్కారమైన ‘కీర్తిచక్ర’ అవార్డును గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఆయనను కలుసుకుని అభినందనలు తెలియజేశారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా దీనిపై తన భావాలను పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అరుణాచల్ ప్రదేశ్ (ఆగస్టు ’23)లో తన అసాధారణ శౌర్యానికి ‘కీర్తిచక్ర’ పురస్కారం గెలుచుకున్న మేజర్ మల్లా రాంగోపాల్ నాయుడును కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇంత చిన్న వయస్సులోనే ఆయన చూపిన శౌర్యం రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం.”

“దేశం కోసం అండగా నిలిచిన ఈ ధైర్య సైనికుడు, అభిమానిగా నన్ను తన హృదయానికి దగ్గరగా ఉంచుకుంటాడని తెలుసుకోవడం నన్ను అత్యంత వినయంగా చేస్తుంది.”

“ఆయన ఆప్యాయత మరియు జ్ఞాపకాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవుడు ఆయనను మరియు ఆయన కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించుగాక.” అని అందులో పేర్కొన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.