ప్రేమ, వినోదం, ఎమోషన్స్ — ఆల్ ఇన్ వన్ ప్యాకేజీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. విడుదలైన నాటినుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, రోజురోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.32.15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“నో టచింగ్… ఓన్లీ హార్ట్ టచింగ్” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఈ సినిమా, వినోదంతో పాటు హృదయాన్ని హత్తుకునే ప్రేమకథను కూడా అందిస్తోంది. హాస్యభరితమైన సన్నివేశాలు, ఎమోషనల్ ట్రాక్‌లు, మరియు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాకు అదనపు బలం అయ్యాయి. ప్రముఖ యూట్యూబర్ మౌళి తనూజ్ ప్రశాంత్ హీరోగా, శివాని నాగారం హీరోయిన్‌గా తమదైన చలాకీ నటనతో ఆడియెన్స్‌ని బాగా ఆకట్టుకున్నారు.
ఇక థియేటర్లలో బుకింగ్స్ పెంచుతూ, చిన్న సినిమా అయినా, కంటెంట్ బలమే విజయం సాధించగలదని లిటిల్ హార్ట్స్ మరోసారి రుజువు చేసింది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న లిటిల్ హార్ట్స్, రాబోయే రోజుల్లో మరింత కలెక్షన్లు సాధించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా ఓ రేంజ్‌లో ట్రెండింగ్ అవుతోంది. అలాగే షార్ట్స్ రూపంలో యూట్యూబ్‌లో కూడా ఈ మూవీ క్లిప్స్ వైరల్ అవుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























