ఇడ్లీ కొట్టు.. తెలుగు రైట్స్ ఆ సంస్థ చేతికి

Idli Kottu Telugu Rights Acquired by Rama Rao Chintapalli's SVM Production Banner

‘కుబేర’తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని అందుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్ స్టార్ ధనుష్ త్వరలో ‘ఇడ్లీ కొట్టు’ సినిమాతో అలరించబోతున్నారు. ధనుష్ హీరోగా, డైరెక్టర్‌గా చేస్తున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ఆకాష్ బాస్కరన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా డైరెక్టర్‌గా ధనుష్‌కి ఇది నాలుగో మూవీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో ధనుష్ సరసన, ట్యాలెంటెడ్ నటి నిత్యా మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ్‌లో ఒకేసారి అక్టోబర్ 1న భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

దీంతో చాలామంది ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం పోటీ పడ్డారు. ఫైనల్‌గా ధనుష్ కెరీర్ లోనే హైయెస్ట్ ప్రైస్‌కి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుంది. నిర్మాత చింతపల్లి రామారావు తెలుగులో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఆయనకి చెందిన శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ శ్రీ వేదక్షర మూవీస్ తెలుగు రైట్స్ సొంతం చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్మాత రామారావు చింతపల్లి మాట్లాడుతూ.. “ఈ సినిమాని అక్టోబర్ 1న ధనుష్ గారి కెరీర్ లోనే హైయెస్ట్ థియేటర్స్‌లో గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తెలుగులో చాలా అగ్రెసివ్‌గా ప్రమోట్ చేసి సినిమాని భారీగా రిలీజ్ చేయబోతున్నాము. ఈ సినిమా తెలుగు రైట్స్ మాకు ఇచ్చినందుకు ధనుష్ గారికి, టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.” అని అన్నారు.

కాగా, ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. టాప్ కంపోజర్ జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. కిరణ్ కౌశిక్ డీవోపీ గా పని చేస్తుండగా, ప్రసన్న జీకే ఎడిటర్, జాకీ ప్రొడక్షన్ డిజైనర్. పీటర్ హెయిన్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ‘ఇడ్లీ కొట్టు’ తెలుగు తమిళ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.