కిష్కింధపురి మీ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది – సాయి శ్రీనివాస్

Kishkindhapuri will give you all a spine-tingling experience says Sai Srinivas

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా కౌశిక్ పెగల్లపాటి తెరకెక్కించిన సినిమా కిష్కింధపురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. రేపే ఈసినిమా థియేటర్లలోకి వస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా నిన్నమేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో హీరో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన ప్రేక్షకులకు, మీడియాకు, నన్ను, సినిమాను ప్రేమించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ఈ వేడుకకు అతిథులుగా వచ్చిన అనిల్ రాపూడి గారికి బుచ్చిబాబు గారికి సుస్మిత గారికి ధన్యవాదాలు. వారు మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది.ఈ తెలుగు ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చాలా హార్డ్ వర్క్ చేసి చేసాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కిష్కింధపురి సెప్టెంబర్ 12న మీ ముందుకు వస్తోంది. భయ పెట్టడం కూడా ఒక ఆర్ట్. ఈ సినిమాతో ఆడియన్స్ ని భయపెడతాం. ఆడియన్స్ కు ఒక మంచి విజువల్, సౌండ్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఒక మంచి కథ చూశామనే శాటిస్ఫాక్షన్ ఉంటుంది. అద్భుతమైన కథ చేసిన మా డైరెక్టర్ కౌశిక్ గారికి థాంక్యూ సో మచ్. కౌశిక్ ఈ సినిమాతో చాలా మంచి స్థాయికి వెళ్తారు. చిన్మయి గ్రేట్ విజువల్స్ ఇచ్చారు.చైతన్ భరద్వాజ్ తన మ్యూజిక్ తో బద్దలు కొట్టేశారు. సెప్టెంబర్ 12న థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఫస్ట్ ఫ్రేం నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆడియన్స్ లీనమైపోతారు.ఒక సినిమాకి ఎంతోమంది కష్టం ఉంటుంది. ఎన్నో కలల తోటి చాలా కష్టపడి ఒక సినిమా చేస్తాం. మీ అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటాం. మీరందరూ మా టీమ్ అందర్నీ సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

మా సినిమానే గూస్ బంప్.కిష్కింధపురి మీ అందరికీ దద్దరిల్లిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. నేను చాలామంది ప్రొడ్యూసర్స్ చూశాను. సాహు గారు చాలా మంచి ప్రొడ్యూసర్. ఇంత మంచి ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉండాలి.మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఉంటుంది.పది మంచి సినిమాలు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఆయన నాతో ఒక కమర్షియల్ సినిమా తీయాలని కోరుకుంటున్నాను.అర్చన గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ టీంకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు. అనుపమ నేను రాక్షసుడు తో మంచి హిట్ కొట్టాం.అందరూ రాక్షసుడు 2 ఎప్పుడు అని అడిగారు. కానీ దానికి మించిన సినిమా చేసాం.అదే కిష్కింధపురి. ఈ సినిమా చూశాక కిష్కింధపురి 2 ఎప్పుడని అడుగుతారు. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాము. ఈ సినిమాని అందరూ సపోర్ట్ చేసి ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్ల అయింది. చాలా హ్యాపీగా ఉంది.చాలా గర్వంగా ఉంది.కొంచెం వెలితిగా కూడా ఉంది.అది కిష్కింధపురి తీరుస్తుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ తో అది అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను.అందరికీ థాంక్ యూ.అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.