లిటిల్ హార్ట్స్ వీక్షించిన అల్లు అర్జున్

Allu Arjun Enjoys Little Hearts Movie


ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతుంది లిటిల్ హార్ట్స్.#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా నటించగా శివాని నాగరం మౌళికి జంటగా నటించింది.ప్రమోషన్స్ తో బాగానే జనాల్లోకి వెళ్ళింది.ఇక ఈసినిమా గత శుక్రవారం థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ తో రోజు రోజు కి కలెక్షన్స్ పెంచుకుంటూ పోతుంది.నిన్నటితో 21 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.మొదటి రోజే ఈసినిమా బ్రేక్ ఈవెన్ కావడంతో భారీ లాభాలను తీసుకొస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాపై స్టార్ హీరోలు ,డైరెక్టర్లు ప్రశసంలు కురిపిస్తున్నారు.ఈ జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయారు.నిన్న ఈసినిమాను చూసి అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా లిటిల్ హార్ట్స్ టీం పై ప్రశంసలు కురిపించారు.ఎక్కడా మెలోడ్రామా లేదు… ప్యూర్ ఎంటర్టైన్‌మెంట్ మాత్రమే.చాలా ఫ్రెష్‌గా,యంగ్‌గా ఉండే లవ్ స్టోరీ.

హీరో మౌళి అద్భుతంగా ఆకట్టుకున్నారు,హీరోయిన్ శివాని నాగరం చక్కని ప్రెజెన్స్ ఇచ్చారు, ఫ్రెండ్స్ & ఇతర ఆర్టిస్టుల నేచురల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది.డైరెక్టర్ మార్తాండ్ వర్క్ నచ్చింది.మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఇచ్చిన మ్యూజిక్ చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది.ఏ మాత్రం కాంప్రమైజ్ చేయని సినిమా! మొత్తం టీంకి హృదయపూర్వక శుభాకాంక్షలు.ఈ స్పెషల్ ఫిల్మ్‌ని థియేటర్లకు తీసుకువచ్చినందుకు బన్నీ వాసు గారికి అభినందనలు అని ఎక్స్ లో అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.