సీతారామంతో తెలుగులోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు మలయాళం హీరో దుల్కర్ సల్మాన్.ఈసినిమా తరువాత గత ఏడాది లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.అంతేకాదు ఈసినిమాతో మొదటి సారి 100కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు.ఇక ప్రస్తుతం దుల్కర్ తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులోఆకాశంలో ఒక తార ఒకటి.పవన్ సాధినేని డైరెక్ట్ చేస్తుండగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.రీసెంట్ గా విడుదలైన ఈసినిమా గ్లింప్స్ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీసెంట్ గా దుల్కర్ తన 41వ చిత్రాన్ని కూడా స్టార్ట్ చేశాడు.దర్శకుడు రవి నేలకుదిటి ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.లవ్ స్టోరీ గా రానుంది.ఈసినిమాలో దుల్కర్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది.ఈవిషయాన్ని ఈరోజు చిన్న మేకింగ్ వీడియో రిలీజ్ చేసి అనౌన్స్ చేశారు.ఈసినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఇక లక్కీ భాస్కర్ తరువాత దుల్కర్ నెక్స్ట్ కాంతతో రానున్నాడు.నిజానికి ఈసినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడింది. దీపావళి కి రిలీజ్ చేయాలని చూస్తున్నారు.రాజ్ కుమార్ పెరియస్వామి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.దుల్కర్ తో కలిసి రానా దగ్గుబాటి ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























