యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నెక్స్ట్ కిష్కింధపురితో వస్తున్నాడు. మరో రెండు రోజుల్లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశాడు.ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు. సినిమా విజయంపై టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా టికెట్ ధరలు అందరికి అందుబాటులో వుండనున్నాయి. నైజాంలో సింగిల్ స్క్రీన్ లలో 150 &మల్టీ ఫ్లెక్స్ 250 ఆంధ్రా లో సింగిల్ స్క్రీన్ 145 & 115 అలాగే మల్టీ ఫ్లెక్స్ 175 ధరల తో టికెట్స్ అందుబాటులోకి రానున్నాయి.ఈ ధరల తగ్గింపు మంచి నిర్ణయం అని చెప్పొచ్చు.సినిమాకు హిట్ టాక్ వస్తేలో ప్రైస్ అడ్వాంటేజ్ కానుంది.
ఈసినిమా మీద వున్న నమ్మకంతో నిర్మాత సాహు గారపాటి రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వంతంగా రిలీజ్ చేస్తున్నాడు.సినిమా కూడా బాగా వచ్చిందని ఇండస్ట్రీ సర్కిల్ లో టాక్ నడుస్తుంది.భయపెట్టే సన్నివేశాలు ఉండడంతో ఈసినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.2 గంటల 5 నిమిషాల నిడివితో కిష్కింధపురి థియేటర్లోకి రానుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























