బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రెస్ మీట్లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఫస్ట్ టైం విజయవాడ వచ్చి ప్రమోట్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ కంటెంట్ మీద చాలా నమ్మకం ఉంది. చాలా హారర్ సినిమాలు చూస్తుంటారు. కానీ ‘కిష్కింధపురి’. చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు ఇలాంటి హారర్ సినిమా రాలేదు. కాన్సెప్ట్ మీద చాలా నమ్మకంగా ఉన్నాము. ట్విస్టులు, షాక్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. మాకు మిరాయ్తో పోటీ లేదు. ముందు మేమే రిలీజ్ డేట్ ఇచ్చాం.” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు అన్ని సినిమాల్ని హిట్ చేస్తారు. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మాత సాహు గారు నిర్మించారు. నిజమైన హంటింగ్ హౌస్‌లో దీన్ని షూట్ చేసాము. ఈ సినిమా షూటింగ్ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. విజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్భుతంగా వచ్చాయి. ఆడియన్స్ ఒక బెస్ట్ హారర్ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు.” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























