ఇండియన్ మావెరిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇంటర్నేషనల్ లెవెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘#SSMB29’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కెన్యాలో జరిగింది. 15 రోజుల ఈ షెడ్యూల్లో కెన్యాలోని ‘మసాయి మారా, సంబురు’ సహా మరికొన్ని ఇతర ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో షూటింగ్ జరిపారు. ఈ సినిమాలో అక్కడి ప్రకృతి అందాలను అద్భుతంగా ఆవిష్కరించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక SSMB29 షూటింగ్ కోసం తమ దేశాన్ని ఎంచుకున్నందుకు రీసెంట్గా కెన్యా పర్యాటకశాఖ మంత్రి మరియు ఇతర అధికారులు రాజమౌళి బృందానికి కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పర్యటనపై తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. “కెన్యాను సందర్శించడం నిజంగా ఒక లైఫ్‌టైమ్ ఎక్స్పీరియన్స్,” అని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా.. “కెన్యాను సందర్శించడం నిజంగా జీవితంలో ఒక్కసారైనా అనుభవించదగిన అందమైన అనుభవం. దాని విస్తారమైన ప్రకృతి దృశ్యాలు మరియు అద్భుతమైన వైవిధ్యం కలిగిన వన్యప్రాణులతో. అక్కడ చిత్రీకరణ నా కెరీర్లో మరపురాని క్షణాలలో ఒకటి. మా షూటింగ్ అంతటా వారి అద్భుతమైన మద్దతు మరియు ఆతిథ్యానికి కెన్యా ప్రభుత్వానికి మరియు మసాయి మారా, నైవాషా, సంబురు మరియు అంబోసేలి స్థానికులకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.” అని తెలిపారు దర్శకధీరుడు.
కాగా SSMB29 అనేది ఒక అడ్వెంచర్ సినిమా కాబట్టి, అలాంటి కథకు కెన్యాలోని లొకేషన్స్ ఎంతో బాగా సరిపోతాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రాజమౌళి ఈ వ్యాఖ్యలతో సినిమాపై మరింత హైప్‌ను పెంచారు. ఈ సినిమా విడుదల తర్వాత కెన్యా అందాలు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం అవుతాయని అందరూ ఆశిస్తున్నారు. కాగా ఈ చిత్రం 120కి పైగా దేశాలలో 30కి పైగా భాషలలో విడుదలకానుండటం విశేషం.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























