మెగా స్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు.రీసెంట్ గా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మెగా ఫ్యాన్స్ చిరుని ఎలా చూడాలనుకున్నారో సినిమాలో అలానే చూపించనున్నాడు అనిల్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటివరకు మూడు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా నెక్స్ట్ షెడ్యూల్ సెప్టెంబర్ 5న స్టార్ట్ కానుందని నిర్మాతల్లో ఒకరైన సాహు గారపాటి తెలిపారు.అలాగే ఈసినిమా షూటింగ్ లో విక్టరీ వెంకేటేష్ అక్టోబర్ నుండి జాయిన్ కానున్నారని ఈరోజు కిష్కింధపురి ట్రైలర్ ఈవెంట్ లో సాహు చెప్పుకొచ్చారు.
ఇక మన శంకరవరప్రసాద్ గారు లో హీరో వెంకటేష్ పవర్ ఫుల్ క్యామియో రోల్ లో కనిపించనున్నారని తెలిసిందే.అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరు సరసన నయనతార నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ ,గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.సంక్రాంతి కానుకగా ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.
న్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 
తెలుగుతమిళ్కన్నడమలయాళండబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























