‘కిష్కింధపురి’ సినిమా చూస్తున్నంతసేపు ఆడియెన్స్ ఎవరూ ఫోన్ కూడా పట్టుకోరని అన్నారు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఆయన ప్రధానపాత్రలో నటించగా, అనుపమ పరమేశ్వరన్ ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. కాగా సెప్టెంబర్ 12న కిష్కింధపురి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ నేడు ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆడియన్స్‌కి మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉండాలని కిష్కింధపురి చేయడం జరిగింది. మంచి సినిమా వస్తే తప్పకుండా జనం థియేటర్స్‌కి వస్తారు. అది నేను నమ్ముతున్నాను. మా కిష్కింధపురి అలాంటి సినిమానే. ఒక మంచి థియేటర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం.”
“మా డైరెక్టర్ గారు చాలా అద్భుతమైన కథ చేసుకున్నారు. మీకు ఒక ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ కూడా చూసుకునే టైం ఉండదు. అంతా అంత థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అంత మంచి కథ తీసినందుకు డైరెక్టర్ గారికి థాంక్యూ. మా మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తారు. అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రార్డినరీ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి.”
“చాలా నమ్మకంతో ఈ సినిమా చేశాం. మీ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మా నిర్మాత సాహు గారి పాషన్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. మా అందరికీ ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయనలాంటి ప్రొడ్యూసర్స్ సినిమా ఇండస్ట్రీకి మరింత మంది రావాలి. సెప్టెంబర్ 12న ఈ సినిమా థియేటర్స్‌లో దద్దరిల్లిపోతుంది. సినిమానే మాట్లాడుతుంది. అందరికీ థాంక్యూ.” అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























