ఓజీ.. రిలీజ్‌కి ముందే సాలిడ్ రికార్డ్

Pawan Kalyan's OG Smashes 1M Dollars in Premiere Pre-Sales at North America

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎక్కడైనా వేరే లెవెల్‌లో ఉంటుంది. కానీ, ఆయన నటించిన “ఓజీ” సినిమాపై అంచనాలు ఏకంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంపై నార్త్ అమెరికాలో కనిపిస్తున్న స్పందన అయితే నిజంగా సంచలనం అనే చెప్పాలి. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక మోహన్‌ కథానాయికగా నటించగా.. ఇమ్రాన్‌ హష్మి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సెప్టెంబర్ 24న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్‌కి ఒక నెల ముందే ఈ సినిమా ప్రీమియర్స్‌కి అక్కడ భారీగా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో ప్రీ-సేల్స్‌లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ డాలర్ల మార్క్ దాటిన చిత్రంగా నిలిచింది. ఇది పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్‌ని మరోసారి రుజువు చేస్తోంది. పవర్ స్టార్ క్రేజ్ ఎప్పటికీ తగ్గదు అని దీనితో మళ్లీ నిరూపితమైంది.

దర్శకుడు సుజీత్ పవన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ కథ, టీజర్లు, పోస్టర్లు ఇప్పటికే ఫ్యాన్స్‌ని క్రేజ్‌లోకి నెట్టేశాయి. ఇప్పుడు ఈ రికార్డ్ బ్రేకింగ్ ప్రీ-సేల్స్ ఓజీ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశాయి. అయితే, ఇప్పుడే ఇలావుంటే, రిలీజ్ డే వరకు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు అందుకుంటుందో.. విడుదల తర్వాత ఏ రేంజ్‌లో రికార్డులు బద్దలు కొడుతుందోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.