#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి లిటిల్ హార్ట్స్ తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.ఈనెల 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది.ప్రమోషన్స్ కూడా ఫన్ వే లో చేస్తున్నారు.ఇక ఈసినిమా స్టూడెంట్స్ కు ఫ్రీగా చూపించాలని టీం ప్లాన్ చేసింది.అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ విజయవాడ ,కాకినాడ ,వైజాగ్ సిటీల్లో ఒక్కో థియేటర్ చొప్పున స్టూడెంట్ స్పెషల్ ఫ్రీ ప్రీమియర్స్ వేయనున్నారు.దీనికి స్టూడెంట్ ఐడి కార్డు ఒక్కటి ఉంటే చాలు. ఇందులో వచ్చే రెస్పాన్స్ సినిమాకు బాగా హెల్ప్ అవుతుందని టీం భావిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ అయితే సినిమా చూడాలన్నఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.సినిమా కూడా రెండు గంటల షార్ట్ రన్ టైం తోనే రానుంది.సినిమాలో కామెడీ బాగా వర్కౌట్ అయ్యిందని టాక్.సాయి మార్తాండ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా రాజీవ్ కనకాల ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నాడు.#90s వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ నిర్మించాడు.ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాతలు బన్నీ వాసు,వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు.
అయితే లిటిల్ హార్ట్స్ కు ఘాటి రూపంలో భారీ పోటీ ఎదురుకానుంది.స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ఈసినిమా కూడా అదే రోజున విడుదలవుతుంది.క్రిష్ ఈసినిమాను తెరకెక్కించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























