సు ఫ్రమ్ సో స్ట్రీమింగ్ డేట్ లాక్

OTT Premiere Date Fixed for Su From So

కన్నడ రీసెంట్ బ్లాక్ బస్టర్ సు ఫ్రమ్ సో ఓటీటీలోకి రానుంది.జులై లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఎక్స్ లెంట్ వ్యూస్ & మౌత్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.కేవలం 5కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈసినిమా ఫుల్ రన్ లో 120కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది.అంతేకాదు  ఈ ఏడాది కన్నడ హైయెస్ట్ గ్రాసర్ మూవీగా రికార్డు సృష్టించింది.ఇక కన్నడలో సెన్సేషనల్ హిట్ అనిపించుకున్న ఈసినిమాను  తరువాత తెలుగులో అదే టైటిల్ తో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా హిట్ అనిపించుకుంది. మైత్రి మూవీ మేకర్స్ సు ఫ్రమ్ సో ను తెలుగు రాష్ట్రాల్లో విడుదలచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ఓటీటీలోకి వస్తుంది.జియో హాట్ స్టార్ సు ఫ్రమ్ సో ను ఈనెల 5నుండి అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.మరి థియేటర్లలో అదరగొట్టిన ఈసినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమాలో రాజ్ బి శెట్టి ,షనీల్ గౌతమ్ ,జె .పి తుమినాడ్ ,సంధ్య అరకెరె ,దీపక్ రాజ్ , మైమ్ రామ్దాస్ ,ప్రకాష్ తుమినాడ్ కీలక పాత్రల్లో నటించారు.జె .పి తుమినాడ్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా లైట్ బుద్ధా ఫిలిమ్స్ నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.