సుందరకాండ చూస్తున్నంతసేపూ ఆడియన్స్ నవ్వుతూనే ఉంటారు

Sundarakanda is My Comeback Film, Says Nara Rohith

నారా రోహిత్ మైల్ స్టోన్ మూవీగా (20వ చిత్రం) తెరకెక్కిన ‘సుందరకాండ’ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సందీప్ పిక్చర్ ప్యాలెస్ (SPP) బ్యానర్‌పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మించారు. వృతి వాఘాని, శ్రీ దేవి విజయ్ కుమార్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా సుందరకాండ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ.. “సుందరకాండ నాకు కం బ్యాక్ సినిమా. డైరెక్టర్ వెంకటేష్ ఈ ఐడియా చెప్పినప్పుడు, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్షన్ పడ్డాను. అయితే అదే సమయంలో వచ్చిన ‘బ్రో డాడీ’ ఒక విండో ఓపెన్ చేసింది. కొంచెం ఆక్వార్డ్ గా ఉండే పాయింట్‌ను అందంగా డీల్ చేసిన సినిమా అది. ఆ స్టైల్‌లో చేస్తే వర్కవుట్ అవుతుందనిపించింది. అప్పుడు వెంకటేష్ ఒక 30 సీన్స్ రాసుకుని వచ్చాడు. అవి నాకు చాలా నచ్చాయి. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం” అని తెలిపాడు.

ఇంకా ఆయన ఇలా చెప్పారు.. “సుందరకాండ చాలా క్లీన్ ఫిలిమ్. ఈ జనరేషన్‌కి ఇది కొత్త కథ. సీన్స్, ట్రీట్మెంట్ చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. లైటర్ వెయిన్‌లో చాలా లైవ్లీగా మంచి ఫన్‌తో నడుస్తుంది. చూస్తున్నంత సేపూ ఆడియన్స్ ఫేస్‌‌‌‌‌‌‌‌లో ఒక స్మైల్ ఉంటుంది. నా క్యారెక్టర్‌కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. క్యారెక్టర్‌లో కొత్త ఎగ్జిట్ ఉంది. కాంప్లికేటెడ్ క్యారెక్టర్. ఆ కాంప్లికేషన్ నుంచే ఫన్ క్రియేట్ అవుతుంది. 30 దాటినా కూడా కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం వెతకడం అనేది చాలా ఇంట్రెస్టింగ్. హీరోకి కావాల్సిన ఆ ఫైవ్ క్వాలిటీస్ అనేవి చాలా పెక్యులర్. అవి మీరు స్క్రీన్ మీద చూడాలి” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.