మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నిన్న ‘మెగా 157’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రానికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే టైటిల్ ఖరారు చేయగా.. ఈ గ్లింప్స్ విడుదలైన వెంటనే అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. కేవలం కొద్ది గంటల్లోనే ఈ గ్లింప్స్ 12 మిలియన్లకు పైగా వీక్షణలను సాధించి, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్లింప్స్‌లో మెగాస్టార్ స్టైల్..
ఈ గ్లింప్స్‌లో చిరంజీవి గారి స్టైల్, ఎనర్జీ, మరియు పవర్ ఫుల్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సూట్ వేసుకుని స్టైల్‌గా కారు దిగి వచ్చే సీన్, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే బీమ్స్ సిసిరోలియో సంగీతం గూస్ బంప్స్ ఇస్తున్నాయి. ఈ గ్లింప్స్ లోని ప్రతి ఫ్రేమ్ చాలా స్టైలిష్‌గా ఉంది. చిరంజీవి గారి నుండి అభిమానులు ఆశించిన మాస్ ఎంటర్‌టైనర్‌ను అనిల్ రావిపూడి అందిస్తున్నారని ఈ గ్లింప్స్ ద్వారా అర్థమవుతోంది.
సంక్రాంతికి మెగా పండుగ పక్కా..
ఈ గ్లింప్స్ చివరిలో ‘పండగకు వస్తున్నాం’ అని చూపించడం, ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుందని సూచిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఒక పక్కా మాస్ ఎంటర్టైనర్‌తో సంక్రాంతికి వస్తున్నారని తెలియడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను సుష్మిత కొణిదెల మరియు సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ గ్లింప్స్ రికార్డు స్థాయి వ్యూస్‌తో సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డులు సృష్టిస్తుందని మెగాస్టార్ అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు చిరు ఈ చిత్రంతో పాటుగా ‘విశ్వంభర’లో కూడా నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇలా నెలల వ్యవధిలోనే రెండు భారీ చిత్రాలు వస్తున్నందున మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























