హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్ ‘గ్లాడియేటర్, అవతార్’ వంటి చిత్రాల స్థాయిలో రామాయణ్ చిత్రాన్ని నిర్మిస్తున్నామని ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, అందుకోసం ఈ సినిమా కోసం ప్రపంచస్థాయి సాంకేతిక నిపుణులను ఉపయోగిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ప్రేక్షకులలో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో నమిత్ మల్హోత్రా తాజాగా ఒక ఇంగ్లీష్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘రామాయణ్’ ఒక గ్లోబల్ ప్రాజెక్ట్:-
రామాయణ్ సినిమా ఒక భారతీయ కథ అయినప్పటికీ, దీనిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నట్లు మల్హోత్రా తెలిపారు. “మా లక్ష్యం భారతీయ ప్రేక్షకులను మాత్రమే కాకుండా, ప్రపంచంలోని ప్రతి మూలలో ఉన్న ప్రేక్షకులను కూడా అలరించడమే. ‘రామాయణ్’ కథలోని గొప్పతనం, దానిలోని భావోద్వేగాలు మరియు విజువల్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతుంది” అని ఆయన అన్నారు.
అత్యున్నత సాంకేతికతతో నిర్మాణం:-
ఈ సినిమా కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్‌ను ఉపయోగిస్తున్నామని నమిత్ మల్హోత్రా తెలిపారు. ‘అవతార్’, ‘హ్యారీ పోటర్’ వంటి హాలీవుడ్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించిన టీమ్‌తో కలిసి పని చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి భారీ బడ్జెట్‌ను ఖర్చు చేస్తున్నారు. సినిమా నిర్మాణంలో ప్రపంచస్థాయి సాంకేతిక ప్రమాణాలను పాటిస్తున్నామని, ఇది తెలుగు సినీ పరిశ్రమకు ఒక గొప్ప ప్రాజెక్ట్ అవుతుందని ఆయన నమ్మకంగా ఉన్నారు.
నటీనటుల గురించి:-
ఈ సినిమాలో నటిస్తోన్న నటీనటుల గురించి ఆయన మాట్లాడుతూ.. “శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి అద్భుతంగా సెట్ అయ్యారు. అలాగే కీలకమైన రావణాసురుడి పాత్రలో రాక్ స్టార్ యష్, హనుమంతుడి పాత్రలో సన్నీడియోల్ తమ అసమాన ప్రతిభను కనబరుస్తున్నారని కొనియాడారు. ఇతర ఆర్టిస్టులు కూడా ఈ సినిమాకోసం ప్రాణం పెట్టి నటిస్తున్నారు” అని తెలిపారు.
ఇక ఈ సినిమాను ఎంత భారీగా తెరకెక్కించినప్పటికీ హాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతే అది మా లోపమే అవుతుందని నమిత్ మల్హోత్ర తెలిపారు.రెండు పార్టులుగా రానున్న రామాయణ్ తొలిభాగం వచ్చే ఏడాది దీపావళికి, అలాగే రెండో భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. రెండు పోర్టులకు కలిపి దాదాపు 4,000 వేల కోట్ల బడ్జెట్ వెచ్చిస్తుండటం గమనార్హం. ‘రామాయణ్’ లాంటి ఒక పురాణ గాథను ఇంత భారీ స్థాయిలో నిర్మిస్తుండటం పట్ల సినీ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























