టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో ‘ఏక్ మినీ కథ’ ఫేమ్ సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’. తెలుగు-తమిళ్ భాషలలో బై లింగ్యువల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాకి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తుండగా.. మిస్ ఇండియా మానస వారణాసి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, టైటిల్ అనౌన్స్‌మెంట్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా ఈ మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ప్రోమోను విడుదలచేశారు. ఇందులో సంతోష్ శోభన్, మానస వారణాసిల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ‘నాలో నేను’ అంటూ సాగే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. సంజిత్ హెగ్డే అద్భుతంగా ఆలపించారు. మొత్తానికి ఈ ప్రోమో అయితే పాటపై అంచనాలను పెంచేస్తోంది.
ఇక ఈ సినిమా కోసం ఆదిత్య రవీంద్రన్ అద్భుతమైన స్వరాలు సమకూరుస్తుండగా.. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే గణేష్ శివ ఎడిటింగ్, మైఖేల్ BFA కళా దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగంగా పూర్తిచేసి త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























