లోకః తెలుగులో కొత్త లోక గా

Lokah Arrives in Telugu as Kotha Loka (edited)

ప్రేమలుతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న మలయాళ యంగ్ హీరో నస్లీన్ నెక్స్ట్ లోకః తో రానున్నాడు.కళ్యాణి ప్రియదర్శన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాను ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నాడు.డొమినిక్ అరుణ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాను తెలుగు రాష్ట్రాల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేయనుంది.టైటిల్ కూడా మారింది. తెలుగులో ఈసినిమా కొత్త లోక గా విడుదలకానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.ఇంతకుముందు పలు తెలుగు సినిమాలను దుల్కర్ కేరళలో రిలీజ్ చేయగా ఇప్పుడు తన సినిమాను తెలుగు టాప్ ప్రొడక్షన్ హౌజ్ ఇక్కడ రిలీజ్ చేయనుంది. సితార థియేట్రీకల్ రైట్స్ తీసుకోవడంతో కొత్త లోక తెలుగులో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈనెల 24న ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇదిలాఉంటే ప్రేమలు తో 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ సృష్టించిన నస్లీన్ ప్రస్తుతం దీనికి సీక్వెల్ కూడా చేస్తున్నాడు. గిరీష్ ఏడి డైరెక్ట్ చేస్తుండగా మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది.వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.