మెగాస్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న ‘మెగా157’ సినిమా టైటిల్ గ్లింప్స్ రేపు విడుదల కానుంది. చాలా కాలంగా ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా ఒక గొప్ప శుభవార్త అనే చెప్పొచ్చు. రేపు, అంటే ఆగస్టు 22న ఉదయం 11:25 నిమిషాలకు ఈ గ్లింప్స్ విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్.. “రేపు ఉదయం 11:25 గంటలకు అద్భుతమైన #Mega157 టైటిల్ గ్లింప్స్‌తో మెగాస్టార్ పుట్టినరోజును జరుపుకుందాం. ప్రసాద్ ఐమాక్స్ PCX స్క్రీన్‌లో ఉదయం 10 గంటల నుండి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరుగనుంది. అనిల్ రావిపూడి సిగ్నేచర్ స్టైల్‌లో చిరుని చూడటం ఒక విందులాగా ఉండబోతోంది” అని అందులో పేర్కొంది.
‘మెగా157’ పై భారీ అంచనాలు
మెగా157 సినిమాను అనిల్ రావిపూడి వంటి మాస్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారని తెలిసినప్పటి నుంచి, ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. చిరంజీవి గారి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి డైరెక్షన్ ఓ రేంజ్‌లో ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఈ సినిమా ఒక పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కాగా ఇందులో వింటేజ్ చిరుని చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి. 1990, 2000లలో చిరంజీవి గోల్డెన్ ఎరాలో కనిపించిన మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను ఈసారి మళ్లీ చూపించబోతున్నాడు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవి తన అసలు పేరు ‘శివశంకర్ వరప్రసాద్’గా డ్రిల్ మాస్టర్ పాత్రలో కనిపించనుండటం విశేషం. ఇది అభిమానులకు ఒక విజువల్ ట్రీట్‌లా ఉండనుంది.
టైటిల్ గ్లింప్స్ అంటే కేవలం టైటిల్ మాత్రమే కాకుండా, సినిమాలోని కొన్ని షాట్స్ కూడా చూపించే అవకాశం ఉంది. ఇక ఈ గ్లింప్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ గ్లింప్స్‌తో సినిమా టైటిల్‌తో పాటు, కథాంశంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ క్రేజీ అప్డేట్‌తో మెగాభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
బ్రేకింగ్ రికార్డ్స్ సిద్ధం!
ఈ కీలక అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటినుండి సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. అభిమానులు పోస్టర్‌లను షేర్ చేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. రేపు ఈ గ్లింప్స్ విడుదల అయిన వెంటనే, అది యూట్యూబ్‌లో రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘విశ్వంభర’ టీజర్ కూడా రేపు రానుంది. దీంతో మెగాస్టార్ పుట్టినరోజున ఇలా రెండు సినిమాల అప్డేట్స్ రానుండటం ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా కానుంది.
మెగా157 సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తోంది. ‘సైరా నరసింహారెడ్డి, గాడ్‌ఫాదర్’ తర్వాత నయన్ చిరుతో కలిసి మూడోసారి నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ కాగా, భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























