విశ్వంభర రిలీజ్ ఎప్పుడో చెప్పిన చిరంజీవి

Megastar Chiranjeevi Reveals Vishwambhara Release Time

మెగాస్టార్ చిరంజీవి మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘విశ్వంభర’ గురించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవి కానుకగా థియేటర్లలోకి వస్తోంది. ఈ మేరకు హీరో చిరంజీవి తాజాగా ఓ ప్రత్యేక వీడియోలో వెల్లడించారు. కాగా ఈ సినిమా చిన్నపిల్లలతోపాటు పెద్దవారిని కూడా అలరిస్తుందని ఆయన తెలిపారు. చిత్రం విడుదలలో జరుగుతున్న జాప్యంపై స్పందిస్తూ, అందుకు సహేతుక కారణం ఉందని, ఇందులో వీఎఫ్‌ఎక్స్‌ పార్ట్ ఎక్కువ ఉంటుందని, అందుకే బెస్ట్ అవుట్‌ఫుట్ ఇచ్చేందుకు మేకర్స్ కృషి చేస్తున్నారని చిరు చెప్పారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఆషికా రంగనాథ్, సురభి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే హిందీ నటుడు కునాల్ కపూర్ మరో ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ సోషియో ఫాంటసీ డ్రామా నుంచి ఇప్పటికే విడుదల చేసిన అద్భుతమైన పోస్టర్లు, విజువల్ వండర్ టీజర్, ఆధ్యాత్మికంగా నిండిన ఫస్ట్ సింగిల్ ‘రామరామ’ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు విక్రమ్, వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న విశ్వంభర పురాణ గాధలను మోడరన్ సినిమాతో బ్లెండ్ చేస్తోంది. హై క్వాలిటీ VFX, భారీ CGI బడ్జెట్‌, అద్భుతమైన కథ ప్రేక్షకులకు విజువల్ వండర్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించబోతోంది. ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోటా కె నాయుడు డీవోపీ, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్ నిర్వహిస్తున్నారు

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.