తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల

Yuvasamrat Naga Chaitanya and His Wife Sobhita Dhulipala Visits Tirumala Temple

యువసామ్రాట్ నాగ చైతన్య అక్కినేని సతీమణి, నటి శోభిత ధూళిపాళ్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం వి.ఐ.పి. దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ స్టార్ జంట రాకతో తిరుమలలో సందడి నెలకొంది. వీరు ఆలయానికి చేరుకోగానే, ఆలయ అధికారులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్వామివారి దర్శనం అనంతరం, అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వదించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. కాగా వీరి రాకతో తిరుమల కొండపై ఉన్న అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. కొందరు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించగా, భద్రతా సిబ్బంది వారిని నియంత్రించారు. చైతన్య దంపతులు తిరుమలలో ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం, నాగ చైతన్య #NC24 (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో ఆయన సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC) బ్యానర్‌పై ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మరోవైపు శోభిత ధూళిపాళ్ల కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.