‘సినిమా బండి’ ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డికె మద్దతు ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, ప్రముఖ నటీమణులు దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాగ్ మయూర్ ముఖ్యమైన పాత్ర పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఆగస్ట్ 22న పరదా థియేటర్స్‌లో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. డైరెక్టర్ ప్రవీణ్ గారు చాలా ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. ఆయన ఎప్పుడూ సినిమా గురించే ఆలోచిస్తారు. నిర్మాతలు విజయ్, శ్రీధర్ గారు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఈ సినిమాని బలంగా నమ్మి ఎక్కడ రాజీ పడకుండా చాలా అద్భుతంగా నిర్మించారు. చిరంజీవి గారి బర్త్ డే రోజైన ఆగస్టు 22న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకు టెక్నీషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”
“దర్శనకి తెలుగు ఇండస్ట్రీకి వెల్‌కమ్ చెప్తున్నాను. దర్శన ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఒక తెలుగు అమ్మాయిలాగే డైలాగ్స్ అన్నీ నేర్చుకుంది. సంగీత గారు ఈ సినిమాకి మరో బిగ్ పిల్లర్. అందరూ రిలేట్ చేసుకునే క్యారెక్టర్ చేశారు. నా కెరీర్ లోనే బెస్ట్ ఫిలిం పరదా. ఆగస్టు 22 మీరు కూడా అదే చెప్తారని నమ్మకం నాకుంది. మీరు సినిమా చూడండి. నచ్చితే ఫ్రెండ్స్‌కి సజెస్ట్ చేయండి. రివ్యూస్ చూసే థియేటర్స్‌కి వెళ్ళండి. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుంది. అందరికీ థాంక్యూ.” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























