సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఘాటి’ సినిమాకు సంబంధించిన తాజా అప్‌డేట్ బయటకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి హీరోయిన్‌గా, కోలీవుడ్ నటుడు విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సెప్టెంబర్ 5న ఘాటి గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, ఫస్ట్ సింగిల్ ‘సైలోరే’ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చిత్ర యూనిట్ సెకండ్ సింగిల్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ‘దస్సోరా’ అనే ఈ రెండో పాటను ఆగస్టు 20న విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.
ఫస్ట్ సాంగ్ వలే ఇది కూడా మ్యూజిక్ ప్రియులను అలరిస్తుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ పాటపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మ్యూజిక్, విజువల్స్, లిరిక్స్ అన్నీ కలిసి మరపురాని అనుభూతిని ఇవ్వనున్నాయని యూనిట్ చెబుతోంది. ముఖ్యంగా అనుష్క – విక్రమ్ ప్రభు కెమిస్ట్రీ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ కానుంది.
చారిత్రాత్మకమైన కథా నేపథ్యం, అద్భుతమైన ప్రొడక్షన్ వ్యాల్యూస్‌తో ఈ సినిమా ప్రేక్షకులను విభిన్నమైన ప్రయాణంలోకి తీసుకువెళ్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. అనుష్క శెట్టి కొత్త లుక్‌లో కనిపించబోతుండటం, క్రిష్ దర్శకత్వం, యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మక నిర్మాణం కలిసినప్పుడు మరో బ్లాక్‌బస్టర్ ఖాయం అనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























