ఎన్టీఆర్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2 గురువారం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు డీసెంట్ రివ్యూలు రాబట్టుకున్న ఈ సినిమా, కూలీతో భారీ పోటీ కారణంగా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించలేకపోయింది. రెండు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 170 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈసినిమాకు వస్తున్న స్పందన చూసి ఎన్టీఆర్ తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వార్ 2 పై మీరు చూపిస్తున్న ప్రేమ నిజంగా నన్ను ఆనందపరుస్తోంది.ఆప్రేమకి నేను మీ అందరినీ అంతే ప్రేమిస్తున్నాను. ప్యాషన్‌తో చేసిన ఈ సినిమాకు ఇంతటి ప్రజా మద్దతు లభించడం గర్వకారణం.ఇక లెట్స్ గో అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మరో హీరోగా నటించగా కియరా అద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా ప్రీతమ్ సంగీతం అందించారు.తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ రిలీజ్ చేశారు. భారీ బడ్జెట్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై అదిత్య చోప్రా ఈసినిమాను నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ రిలీజ్ చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























