హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ ల స్పై థ్రిల్లర్ వార్ 2 గురువారం భారీ అంచనాల మధ్య వచ్చి డీసెంట్ రివ్యూస్ ను రాబట్టుకుంది.అయితే కూలీతో భారీ పోటీ ఎదురుకావడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లను రాబట్టుకోలేక పోయింది.అయినా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు సాలిడ్ వసూళ్లను రాబట్టుకున్నా హిందీలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లను దక్కించుకోలేకపోయింది.అయితే రెండో రోజు హాలిడే కావడంతో హిందీ కలెక్షన్స్ భారీగా పెరిగాయి.మొదటి రోజు హిందీ లో 28 కోట్ల నెట్ కలెక్ట్ చేయగా రెండో రోజు ఏకంగా 45 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ఈరోజు ,రేపు కూడా ఇదే జోరు కొనసాగించనుంది.ఇక సోమవారం నుండి ఎలాంటి రన్ ను కనబరస్తుందో అనే దానిపై విజయావకాశాలు ఆధారపడి వుండనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు విషయానికి వస్తే కూలీ రూపంలో వార్ 2 కి గట్టి పోటీ ఎదురవుతుంది రెండు రోజుల్లో ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. టార్గెట్ ఎక్కువగా ఉండడంతో భారీగా పుంజుకోవాల్సినసరం వుంది.
వార్ కి సీక్వెల్ గా బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించగా ప్రీతమ్ సంగీతం అందించాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అదిత్య చోప్రా ఈసినిమాను నిర్మించాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























