మోస్ట్ అవైటెడ్ కూలీ మరో 2 రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రెండు వరుస ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడి నుండి వస్తున్న సినిమా కావడం అలాగే స్టార్ కాస్ట్ నటించడంతో కూలీ పై మొదటి నుండే భారీ అంచనాలు వున్నాయి.ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు.ప్రమోషనల్ కంటెంట్ కూడా జనాలకు బాగా రీచ్ అయ్యింది. దాంతో సినిమాపై హైప్ విపరీతంగా పెరిగిపోయింది.ఇక అందుకు ఈసినిమా తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొడుతుంది. ఇప్పటివరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 65 కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి.ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ కాలేదు.టికెట్ హైక్ కోసం రెండు రాష్ట్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు.రేపు జీవో వచ్చే వచ్చే ఛాన్స్ వుంది. అటు ఓవర్సీస్ లోనూ ఈసినిమా అదరగొడుతుంది. ప్రీ సేల్స్ 30 కోట్లు దాటాయి.ఒక్క నార్త్ అమెరికా లోనే 2 మిలియన్ మార్క్ చేరుకుంది.ట్రెండ్ చూస్తుంటే కూలీ మొదటి రోజు 150 కోట్ల పైనే వసూళ్లను రాబట్టుకొనేలా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లోకేష్ మార్క్ ఎంటరైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించగా కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఉపేంద్ర , షౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతం అందించగా సన్ పిక్చర్స్ నిర్మించింది.
అయితే కూలీకి తెలుగు ,హిందీలో భారీ పోటీ ఎదురుకానుంది.కూలీ వస్తున్న రోజే హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ ల వార్ 2 కూడా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.దాంతో కూలీ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఎదుర్కోనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























