యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే అత్యధిక వసూళ్లను రాబట్టిన భారతీయ యానిమేటెడ్ సినిమాగా రికార్డు సృష్టించగా ఇక ఇప్పుడు 200కోట్ల మార్క్ క్రాస్ చేసి సెన్సేషన్ సృష్టించింది.17 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 210 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.శని, ఆదివారాల్లో ఈసినిమా దుమ్ము రేపింది.మూడో వారం లోనూ ఏ మాత్రం స్లో అవ్వకుండా సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిందీలో అయితే 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.కొత్త సినిమాలతో పోటీని తట్టుకొని అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతుంది. 17రోజుల్లో హిందీ వెర్షన్ దేశ వ్యాప్తంగా 125కోట్ల కుపైగా నెట్ వసూళ్లను రాబట్టుకుంది. ఫుల్ రన్ లో 150కోట్ల క్లబ్ లో చేరనుంది.
ట్రెండ్ చూస్తుంటే మహావతార్ నరసింహ ఫుల్ రన్ లో ఈజీగా 250 కోట్లపైనే వసూళ్లను రాబట్టుకునేలా వుంది.లిమిటెడ్ బడ్జెట్లో వచ్చిన ఈసినిమా బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొస్తుంది.అటు నార్త్ అమెరికా లోనూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటితో అక్కడ 1 మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసింది.
తెలుగులోనూ ఈసినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.విష్ణువు దశ అవతారాల పురాణ గాథ ఆధారంగా అశ్విన్ కుమార్ ఈసినిమాను తెరకెక్కించగా సామ్ సీఎస్ సంగీతం అందించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోమ్ బలే ఫిలిమ్స్ నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























