తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించేందుకు తెలుగు సినిమా పరిశ్రమ నిర్మాతలు తాజాగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక , సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో సమావేశం అయ్యారు. ఈ మేరకు 13మంది నిర్మాతల బృందం సోమవారం మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో మంత్రితో భేటీ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఫెడరేషన్ స్ట్రైక్, కార్మికుల సమస్యలపై మంత్రి దుర్గేష్‌కి ప్రొడ్యూసర్స్ వివరించారు. సినీ పరిశ్రమలో తాజాగా చోటుచేసుకున్న ఉదంతాలు, అందుకు దారి తీసిన పరిస్థితులపై వారు మంత్రికి వివరాలు అందించారు. ప్రధానంగా కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలన్న డిమాండ్‌ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అంతకుముందు నిర్మాతల బృందం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఏపీ సచివాలయానికి వెళ్లారు.
మంత్రి దుర్గేష్‌ని కలిసిన సినీ ప్రముఖులు వీరే..!
- భరత్ (తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు)
- మైత్రీ రవిశంకర్
- డీవీవీ దానయ్య
- నాగవంశీ
- బన్నీ వాసు
- బీవీఎస్ఎన్ ప్రసాద్
- కేఎల్ నారాయణ
- స్వప్నా దత్
- యూవీ క్రియేషన్స్ వంశీ
- టీజీ విశ్వప్రసాద్
- వివేక్ కూచిబొట్ల
- సాహు గారపాటి
- చెర్రీ
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























