మచ్ అవైటెడ్ కూలీ మరో 8 రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ప్రమోషన్స్ గట్టిగానే చేశారు. సినిమా కూడా జనాలకు బాగానే రీచ్ అయ్యింది.దాంతో మొదటి రోజు ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోవడం ఖాయం. ఇక ఓవర్సీస్ లో అయితే రిలీజ్ కు ముందే సెన్సేషనల్ బుకింగ్స్ అవుతున్నాయి. ఇప్పటివరకు 17 కోట్ల ప్రీ సేల్స్ అయ్యాయి. వారం పైనే గ్యాప్ ఉండడంతో ప్రీమియర్స్ తోనే రికార్డు ఓపెనింగ్స్ ను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వరుస ఇండస్ట్రీ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ నుండి సినిమాకావడం తో కూలీపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ ఇందులో హీరోగా నటించగా కింగ్ నాగార్జున నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. ఉపేంద్ర , షౌబిన్ షాహిర్, శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు.
ఇక హైప్ కి తగ్గట్లే కూలీ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చేసిన తమిళ సినిమా గా రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ రూపంలో దాదాపు 500 కోట్లపైనే బిజినెస్ చేసింది.దాంతో కూలీ ముందు భారీ టార్గెట్ వుంది. అయితే కూలీ వస్తున్న రోజే హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ ల వార్ 2 కూడా రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఉండడంతో తెలుగులోనూ ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.దాంతో కూలీ తెలుగు ,హిందీలో భారీ పోటీ ఎదుర్కోనుంది.
లోకేష్ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా A సర్టిఫికెట్ తో థియేటర్లలోకి రానుంది. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ క్యామియో రోల్ లో మెరవనుండగా అనిరుధ్ సంగీతం అందించాడు. సన్ పిక్చర్స్ ఈసినిమాను నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























