మాస్ జాతర సెకండ్ సాంగ్ రిలీజ్

mass jathara second song released

మాస్ మహా రాజా రవితేజ నెక్స్ట్ మాస్ జాతరతో రానున్నాడని తెలిసిందే.రవితేజ కు ఇది 75వ సినిమా.షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా విడుదలకు రెడీ అవుతుంది.ముందు చెప్పిన ప్రకారం ఆగస్టు 27నే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.ఇక ఈసినిమా నుండి ఈరోజు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు.ఓలే ఓలే అంటూ సాగే ఈసాంగ్ రిపీట్ మోడ్ లో వినేలా వుంది.మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ బీట్స్ కి రవితేజ ,శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ థియేటర్స్ ను షేక్ చేయనుంది.ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ పెద్ద హిట్ కాగా సెకండ్ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ అనిపించుకోనుంది.ఈ మాస్ లవ్ సాంగ్ ను రోహిణి, భీమ్స్ సిసిరోలియో పాడగా
భాస్కర్ యాదవ్ లిరిక్స్ అందించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భాను భోగవరపు ఈసినిమాను తెరకెక్కిస్తుండగా రవితేజ ఇందులో రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.ఈసినిమాతో హిట్ కొట్టి రవితేజ ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.రవితేజ మార్క్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నాడు భాను భోగవరపు.దర్శకుడిగా తనకు ఇదే మొదటి సినిమా.త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఇక రవితేజ ప్రస్తుతం తన 76వ సినిమాలో నటిస్తున్నాడు.నేను శైలజా ఫేమ్ కిషోర్ తిరుమల ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. దసరా నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు.సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.