నాగార్జున గారిని కన్విన్స్ చేయడమే నాకు పెద్ద ఛాలెంజ్

Coolie Director Lokesh Kanagaraj Says, Convincing Nagarjuna Was a Big Challenge For Me

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ ‘కూలీ’. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆగస్టు 14న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సందర్భంగా  మేకర్స్ తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ మరియు ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని నాకు ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్‌కి థాంక్యూ. నన్ను ఈ ప్రాజెక్ట్‌లో బిలీవ్ చేసిన రజనీ సార్‌కి థాంక్ యూ. అమీర్ ఖాన్ గారు, సత్యరాజ్ గారు, సౌబిన్ గారు, ఉపేంద్ర గారికి థాంక్ యూ. నాగార్జున గారిని ఈ సినిమాకి కన్విన్స్ చేయడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్. దాదాపు 7 నరేషన్స్ ఇచ్చాను. ఫైనల్‌గా ఆయన ఒప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఈ సినిమాలో ఎంత అద్భుతంగా నటించారో మీరే చూడబోతున్నారు. అందరికీ థాంక్యూ సో మచ్” అని అన్నారు.  

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.